చల్తే చల్తే మేరి యే బాత్ నహి భూల్నా ఖభీ అల్విదా నా కహెనా . . .

Saturday, July 18, 2009

పుట్టపర్తినాకు దేవుడంటే భయమూ ,భక్తీ రెండూ వున్నాయి. ఎక్కడికి ఇల్లు మారినా దగ్గరలో గుడీ , లైబ్రరీ ని ముందు వెతుకుంటాను. వీలైనంతవరకూ ప్రతిరోజూ వుదయం గుడికి వెళుతాను. పూజలూ, నోములూ ,వ్రతాలు చేసుకుంటాను .ఇదివరకు ఉపవాసాలుకూడా వుండేదాన్ని ,కాన్ని ఇప్పుడు ఉండలేక మానేసాను. ఏ కొంచం ఇబ్బంది వచ్చినా నా మొక్కులంటే మా ఇంట్లో వాళ్ళకి హడలుపుట్టేంతగా మొక్కులు మొక్కేసుకుంటాను. కొన్నిసార్లు ఏం మొక్కుకున్నానో కూడా మర్చిపోతుంటాను అది వేరే విషయం. ఇదంతా ఉదయము పది గంటల వరకే పరిమితం. ఆ తరువాత మళ్ళీ మరునాడుదయం వరకూ దేవుడిని ఇబ్బంది పెట్టను. ఎంత దేవుడంటే భక్తి వున్నా ,స్వామీజీలు ,బాబాలు అన్నా , భజనలన్నా ఇష్టం లేదు. దేని ప్రభావమో తెలీదుకాని ,స్వామీజీలంటే నమ్మకము లేదు. సత్య సాయిబాబా హైదరబాద్ వచ్చినప్పుడల్లా మా అత్తగారు , మామగారు శివంకి వెళ్ళేవారు. ఇంట్లో బాబా ఫొటోలు కూడా వుండేవి .అయినా మరి ఎందుకో ఎప్పుడూ బాబా మీద నమ్మకమైతే కలగలేదు. అసలెప్పుడూ బాబా గురించి ఆలోచించనూ లేదు.

మా అమ్మాయి పెళ్ళి జరిగాకా మా వియ్యపురాలు నా పార్లర్ కి వస్తుండేవారు. ఆవిడకి సత్య సాయిబాబా అంటే చాలా నమ్మకం , భక్తి. ఆవిడ మమ్మలిని కోరిన ఒకేఒక కోరిక పెళ్ళి సత్య సాయి నిగమాగం లో చేయమని. ఆవిడకోరిక బలమేమో కొద్ది పిరియడ్ లోనే ఆ హాల్ దొరికి మా అమ్మాయి పెళ్ళి అక్కడే చేసాము. ఆవిడ పార్లరికి వచ్చినప్పుడల్లా సాయి బాబా గురించే మాట్లాడేవారు. అమ్మాయి అత్తగారు కదా మొహమాటం గా వినేదాన్ని. సడన్ గా ఓ సారి రేపు శివరాత్రి పుట్టపర్తి వెళుదామంటే నాకు తొడేవరూ లేరు అన్నారు.వెంటనే నేనొస్తాను అన్నాను. ఆవిడ చాలా సంతోషించి అప్పటికప్పుడే నైట్ బస్ కి టికెట్స్ కొన్నారు. అలా అనుకోకుండా పుట్టపర్తి కి మా వియ్యపురాలు సరళ గారి తో కలిసి వెళ్ళాను.

రాత్రి బస్ ఎక్కి పొద్దున్నే ప్రశాంతి నిలయం ముందు దిగాము. మాకు రూం దొరకటము కష్టమైంది. డార్మెంటరీ లో దొరికింది.అది ఒక పెద్ద షెడ్ .వరుసగా చాపలు పరిచి వున్నాయి. అక్కడే మా సామాను పదిల పరుచుకొని ,బాబా ఉపన్యాసం వినటాని కి వెళ్ళాము, కాని అప్పటికే అయిపోయింది. సాయంకాలము దర్షనం వుందంటే ,టిఫ్ఫిన్ చేయటానికి వెళ్ళాము. అక్కడ సరళ గారికి తెలిసినావిడ కనిపించి కుశలం అడిగి ,ఎక్కడున్నావు అని అడిగింది. డార్మెంటరీ లో అనగానే ఆవిడ నొచ్చుకొని గోకక్ గారమ్మయి అని కౌంటర్ లో చెప్పి రూం ఇప్పించారు. అలా రూంలో కి వెళ్ళి ఫ్రెషప్ అయ్యి కొంచం సేపు ప్రశాంతి నిలయమంతా తిరిగాము. చాలా బాగుంది. చాలా ప్రశాంతముగా వుంది. అక్కడ అంతమంది తిరుగుతున్నా ఎక్కడా చప్పుడేలేదు..

రాత్రంతా ప్రయాణము వలన కొంచం సేపు విశ్రాంతి తీసుకుందామని రూం కి వచ్చి చాపలు పరుచుకొని పడుకున్నాము.వెంటనే నాకు నిద్ర పట్టింది. నా పక్కనే సాయిబాబా నిలబడి ఏదో చెపుతున్నారు. నాకు గబుక్కున మెలుకువ వచ్చింది. లేచి చూస్తే సరళ అయారవుతూ, లే మాలా మనం దర్షనానికి వెళ్ళాలి అన్నారు.

దర్షనమైయే ప్రదేశం లో చాలా మంది వున్నారు.అప్పటి దాకా లేని ఇంత మంది ఎక్కడనుండి వచ్చారో ! ఎక్కడా కుర్చునే స్తలమే లేదు. నేను నిద్ర పోవటమువల్లే ఆలస్యం అయ్యింది కదా అని గిల్టీ గా అనిపించింది.చివరికి వెళ్ళి కూర్చుందామని వెళుతున్నాము , ఇంతలో పొద్దున కనిపించిన ఆవిడనే కనిపించి వెనకకి వెలుతున్నావేమిటి ? ముందుకురా అని మమ్మలిని తీసుకెళ్ళి ముందు వరుసలో కూర్చో పెట్టింది. మేము వెళ్ళిన కొద్దిసేపటికే సత్య సాయిబాబా వచ్చారు.అందరూ వారి వారి కోరికలేమో రాసి ,కవర్లు పెట్టి ఆయనకు ఇస్తున్నారు.అవి అందుకుంటూ మా ముందుకు వచ్చారు. మాముందు నిలబడ్డారు. నేను తలెత్తి చూడగానే దండం పెట్టుకో బంగారూ అన్నారు. నేను అప్రయత్నముగా పాద నమస్కారం చేసాను. వెంటనే ఇంతకు కొద్దిసేపు ముందు కలలో నాపక్కన ఆయన నిలబడింది గుర్తుకు వచ్చింది.

ఇక అప్పుడే తిరిగి రాత్రి బస్ లో హైదరాబాద్ వచ్చేసాము. అక్కడ అందరిలో సేవా భావము ఎక్కువగా కనిపించింది.భోజనము, వసతి తక్కువ ధర లోనే ఏర్పాటు చేసారు.చిన్న చిన్న రూములలో అక్కడే నివాసము ఏర్పాటు చేసుకొని వున్న వారున్నారు. ఒక పూటనే వున్నందువలన అక్కడి ఇతర ప్రదేశాలు చూడలేదు.తరువాతి సంవత్సరము కూడా ఆవిడకి తోడుగా వెళ్ళాను. అప్పుడూ ఒక పూట్నే వుండి వచ్చాము. ఆయన శివలింగము తీయటము,అందరికీ ఏవేవో బహుమతులు గాలి లో సృస్టించి ఇవ్వటము వగైరా ఏమో కాని అక్కడ ఆయన ఏర్పాటు చేసిన విద్యాలాయాలు, ఆసుపత్రి మొదలైన వాటి తో సామాన్య జనులు లాభ పడుతున్నారు.అంతా ఒక పద్దతి ప్రకారము నడుస్తోంది.ముఖ్యముగా హిందూ దర్మ ప్రచార మైతే జరుగు తోంది.అక్కడి వెళ్ళి వచ్చాక సాయిబాబా మీద నమ్మకము, భక్తి ఐతే కలుగ లేదు కాని ,వ్యతిరేకత ముందంత లేదు.

పైన వున్న చిత్రము పుట్టపర్తి యూనివర్సిటీ ది.

8 comments:

Anonymous said...

Meeru adrustvantulu.baba mimmalani pilipinchukunaru..ayyina karuna mi mida padindi.bhakthi entaseptilo ravali ledni..Sailu

Anonymous said...

maa sanskrit maastaaru okaru vundevaaru...puttaparti baba veera bhaktudu....lingaalu,langaalu teesivvatam fake avvachu..but mana manasulo anukunedi cheppestaadanta....how is this possible??

మాలా కుమార్ said...

sailu gaaru, yhanks andi.

మాలా కుమార్ said...

harish garu,
thanks andi,
maa viyyapuraali gaarini aaavida anubhavaa raayamani adigaanu. aavida ivvagane publish cestaanu, andulo mee prasna ki samaadhaanam vuntundemo chuuddaamu.

తృష్ణ said...

మాలా కుమార్ గారు,మేము కూడా మా తాతగారి టైం నుంచి స్వామి భక్తులం.మా ఇంట్లొ కొందరు అక్కడ చదువుకున్నారు కూడా.స్వామి అదివరకూ మంచి దర్శనాలు ఇచ్చే టైములో నాకు ఒక పాదనమస్కార భాగ్యం దక్కింది.అదే నా జీవితం ధన్యమైన రోజు.

Anonymous said...
This comment has been removed by a blog administrator.
Anonymous said...

http://www.youtube.com/watch?v=EwOecpMkHH0

మాలా కుమార్ said...

trushna gaaru,
harish garu thank you