చల్తే చల్తే మేరి యే బాత్ నహి భూల్నా ఖభీ అల్విదా నా కహెనా . . .

Saturday, June 13, 2009

బరోడా


గుజరాత్ లో మూడవ పెద్దనగరం వడోద్రా ,సూరత్, అహందాబాద్ తరువాత అన్నమాట.ఇక్కడ చాలా ఏండ్లు మహారాజుల పరిపాలనే వుండింది. ఇక్కడి హిస్టరి గురించి నాకు అంతగా తెలీదు. నగరమంతా పాలేస్ లతో కమాన్ లు తోటలు,చిన్న చిన్న చెరువులతో చాలా అందంగా వుంటుంది(వుండేది, ఇప్పటిసంగతి తెలీదు.)
ఇక్కడమేము 1981 ఏప్రిల్ నుంచి, 1984 ఏప్రిల్ వరకు వున్నాము.రైల్ వే స్టేషన్ నుండి ఇంటికి వెళుతుండాగానే అబ్బ ఎంత బాగుంది ఈవూరు అనుకున్నాను.ఇంటికి వెళ్ళగానే స్టవ్ వెలిగించమని మా వారు అంటే ఎందుకా అనుకుంటూ స్టవ్ వెలిగించగానే అబ్బో ఇక ఈ వూరు వదలద్దు అనుకున్నాను. ఎందుకంటే స్టవ్ వెలిగించగానే నల్లా తిప్పగానే నీళ్ళు వచ్చినట్ట్లు ,గొడ మీద నాబ్ తిప్పగానే గాస్ వచ్చింది.సిలిండర్ పనిలేదు.అయిపోతుందని లేదు.నెలకి 20 రూపాయలు కడితే చాలు.పైప్ లైన్ గాస్ అన్నమాట.ఎంత సుఖమో!

దీనికంటే ముందు మావారు బరొడా లో రెండుసార్లు వున్నారు.అప్పుడు టెన్నిస్ క్లబ్ లో సుధీర్ ధాండేకర్, అయన ద్వార రమేష్ పార్లీకర్ పరిచయం వున్నారు. మేము వెళ్ళగానే రమేష్ పార్లీకర్ ఇంటికి భోజనానికి వెళ్ళాము.ఆయన భార్య కల్పన వారి అబ్బాయిలు ముగ్గురూ మమ్మలిని చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. రమేష్ సైకాలజీ ప్రొఫెసర్గానూ, కల్పన ఎడ్యుకెషనల్ డిపార్ట్మెంట్ లో ప్రొఫెసర్గానూ పని చెస్తున్నారు. అందువల్ల అద్యాపక్ కుటీర్ లో వుండే వారు.మేమున్న ఏరియా ఫథెగంజ్.తరువాత ఆర్మీ ఏరియాకి మారాము.అన్ని కూడా దగ్గర దగ్గరనే .
రోడ్స్ అన్నీ చాలా పెద్దగా శుభ్రంగా వుండేవి.రోడ్ పక్కన పెద్ద పెద్ద చెట్లు ,వాటికింద సిమెంట్ బేంచీలు.సిమెంట్ బెంచీలు రోడ్ పక్కన ఎందుకున్నాయా అనుకున్నాను.రాత్రి కాగానే అందరూ పనులు ముగించుకోని వాటి మీద కుర్చొని చిరుతిండ్లు తింటూ రాత్రి పొద్దు పోయేదాకా వుండేవారు.పొద్దున ఆఫ్ఫిస్ లైనా దుకాణా లైనా పదకొండు తరువాతే తెరిచేవారు.కులాసా జీవులు.పెద్ద పెద్ద ఐస్క్రీం పార్లర్లూ అక్కడే మొదటిసారి చూసాను.
మే మున్న ఏరియాకి దగ్గరలోనే యూనివర్సిటీ,దాని అనుబంద కళాశాలలు వాటి ఎదురుగా కమాటీ భాగ్ అని పెద్ద తోటా వున్నాయి.ఆ భాగ్ ఎదురుగా పావ్ భాజీ, భేల్ పూరీ బండ్లు ,అక్కడ ఏంత రుచిగా చేసెవారో! ఏంతైనా గుజరాతీలు భోజన ప్రియులు.
అప్పుడే అక్కడ చైల్డ్ డెవలప్మెంట్ లో ప్రీ స్కూల్ మానేజ్మెంట్ కొర్స్ లో సీట్ వచ్చింది.మా ఫ్రేండ్ ఉషా దాండేకర్ తన బ్యూటీ పాల్లర్లో పని చేయటానికి అవకాశం ఇచ్చింది.కల్పన దీదీ బ్యుటీ పర్లర్లో మోజు కొన్ని సంవత్సరాల తరువాత తగ్గి పోవచ్చు,కాని నర్సరి టీచర్ కి గైనకాలజిస్ట్కీ మాత్రం ఎప్పటికీ డిమాండ్ తగ్గదు ముందు కోర్స్ చేయి అంది.అనే కాకుండా ఉస్మానియా యునివర్సిటే లో పి.జి చేయలేకపోయాను అనె భాధ ను తగ్గించుకొవటాని కి యం.యస్ యూనివర్సిటీ లో అడుగు పెట్టాను. అక్కడ స్టుడెంట్స్ ,లెక్చరర్ అనే తేడా వుండేది కాదు.అందరూ కలిసి ఫ్రెండ్స్ లా వుండేవారు.మొదటి సెమిష్టర్ లో నా అనారోగ్యము వలన ఫస్ట్ పార్ట్ సరిగ్గారాయలేకపోయాను..సెకండ్ పార్ట్ కూడా అయ్యాక క్లాస్ లో మార్క్స్ చదువుతూ ఫస్ట్ పార్ట్ లో మాలా బెన్ (అందరి పేర్లెకీ చివర బెన్ తప్పకుండా చేర్చెవారు) ఫేల్ అని లెక్చరర్ చదవగానే ఏంత సిగ్గు బాధ ఏడుపు వచ్చాయ్. ఇంతలోనే సెకండ్ పార్ట్ లో ఓ గ్రేడ్ అనగానే క్లాస్ మొత్తం చప్పట్ల తో అభినందించారు.ఒకే సమయములో,బాధ,సిగ్గు,ఆపైన సంతొషం ,గర్వం .అబ్బో ఆ క్షణాలు మరుపురానివి.
ఆర్మీ ఏరియాలో దక్షణామూర్తి ఆలయము చూడ తగినది.అది మామూలు దేవాలయాల లాగా కాక భిన్నం గా మొత్తము అల్యూమినియం షీట్స్ తో కట్టారు.దానిని నిర్వహించేది ఇ.యం.ఇ జవానులు.చాలా బాగుంటుంది.
అప్పుడే కొన్ని సంవత్సరాలు లక్ష్మి పాలెస్ లో విజిటర్స్ ని అనుమతించక పోవటము వలన చూడలేకపోయను.
దసరా రోజులలో ధాండియా చాలా కనుల పండుగ గా జరిగేది. అమ్మాయిలూ, అబ్బాయిలూ కలిసి రాత్రంతా తిరుగుతూ దాండియా ఆడుతుండే వారు.

వడోద్రా అని పేరు మారినా మాకు బరోడా అనటమే ఇష్టం. మాకు ఒకరకంగా బరోడా సెకండ్ హోం స్టేషన్ అనుకుంటాము.మా అందరికీ బరోడా అంటే చాలా ఇష్టం.ఎవరైనా గుజరాతీలు కనిపిస్తే మా వారు,కేంచో ,తుమారూ సూ నాం చే అని ఆప్యాయం గా పలకరిస్తారు. కల్పనా దీదీ ,ఉషా దాండేకర్ రమ్మని ఎప్పుడు ఆహ్వానిస్తారు.మళ్ళీ ఒకసారైనా వెళ్ళాలి అనె వుంది. కాని ఏప్పుడో1
1.,2.లక్ష్మి పాలెస్
3,5.దక్షణామూర్తి మందిరం,
4.యునివర్సిటీ భవనము
5.మా ఇంటి తోట,
6. మా కామపస్ ప్లే గ్రౌండ్,
7.బరోడా ఆంద్ర సమితి,
8.పావాగడ్ బరోడా కి కొద్ది దూరములో కొండమీద మాతా మందిర్,
9.కమాటీ బాఘ్

9 comments:

jaya said...

Its really marvoles and supurb. Chaallaa bagundi. Malli Baroda velli natlaindi. Baga rasaavu.

మాలా కుమార్ said...

thankyoujaya

Srujana Ramanujan said...

Nice post. The slide show is good

psmlakshmiblogspotcom said...

మాలాగారూ
ఇప్పటిps ఫోటోలు ఎవరైనా పెడతారు. కానీ మీరు పాత ఫోటోలు పెట్టి చాలా మంచిపని చేశారు. అప్పుడు ఆ ప్రాంతాలు ఎలా వున్నాయో చూపించారు. చాలా బాగుంది. ఫోటోలో మీరుకూడా వున్నట్లున్నారు. అప్పటి మిమ్మల్ని చూసేశానోచ్. మీవారి ఉద్యోగరీత్యా మీరు చాలా ప్రదేశాలు తిరిగినట్లున్నారు. అప్పటి అనుభవాలన్నూ గుర్తుచేసుకుని రాయండి. అడవుల్లో వుండటంగురించి వోకౌన్ధీ లో అనుకుంటా చదివాను. అలాంటి అనుభవాలు అందరికీ వుండవు. మాలాంటివాళ్ళం ఆసక్తిగా చదువుతాము.
psmlakshmi

కథాసాగర్ said...

good description about your experiences in baroda..

మాలా కుమార్ said...

థాంక్ యు స్రుజన

మాలా కుమార్ said...

అయ్యో గుర్తుపట్టేసారా?ఇప్పుడెలాగా?
చాలా థాంక్సండి.

మాలా కుమార్ said...

kathaasaagar gaaru,
thaank you

దొంగనా కొడుకు said...

good one