Saturday, October 3, 2009
కర్నూలు
1991 లో కర్నూల్ కు మావారు పని మీద వెళుతుంటే నేను ,పిల్లలు కూడా వెళ్ళాము. మల్లాది ఏదో నవల లో కొండా రెడ్డి బురుజు గురంచి చదివినప్పటి నుండి , అది చూడాలని కోరిక వుండింది. మావారు పని లో వుండగా నేను , మా అమ్మాయి , మా అబ్బాయి కర్నూల్ అంతా తిరిగాము. అక్కడ నేను చూద్దామనుకున్న కొండారెడ్డి బురుజు దగ్గర చాలా సమయము గడిపాము. దాని వెనుకననే పోలిస్ స్టేషన్ వున్నట్లు గుర్తు.
ఆ తరువాత తుంగభద్ర దగ్గర సాయిబాబా గుడి లో కొద్దిసేపు వున్నాము.
ఇకపైన చూసేందుకు ఏమీ లేవన్నారు అక్కడి హోటల్ సిబ్బంది. మేమున్న హోటల్ కి దగ్గరలో వున్న సినిమా హాల్ లో వెంకటేశ్ , భానుప్రియ నటంచిన శ్రీనివాస కల్యాణం సినిమా చూసాము.
నిన్నటి నుండి టి . వి లో కర్నూల్ ను చూస్తూవుంటే అప్పుడు మేము చూసిన కర్నూల్ గుర్తుకువచ్చి చాలా బాధ కలుగుతోంది. ఆ రోజు మేము తిరిగిన కొండా రెడ్డి బురుజు కు ,ఈ రోజు పేపర్ లో చూసిన కొండారెడ్డి బురుజుకు తేడ చూస్తూవుంటే మనసు తరుక్కు పోతోంది !
కన్నతల్లి లా అక్కున చేర్చుకునే నదీమతల్లి ఆగ్రహిస్తే పరిస్తితులు ఎంత దారుణముగా వుంటాయోకదా ! ఎంత ఎత్తుకు ఎదిగినా మనిషి ప్రకృతి ముందు తలదించవలసినదేకదా !
Subscribe to:
Post Comments (Atom)
2 comments:
>> ఎంత ఎత్తుకు ఎదిగినా మనిషి ప్రకృతి ముందు తలదించవలసినదేకదా !
very true. I penned down లెక్క తప్పిన అనులోమ విలోమ నిష్పత్తి! http://maruvam.blogspot.com/2009/05/blog-post.html
with an end note
గనులు తవ్వి పోస్తూ ఇతను, భుకంపమై జ్వలిస్తూ తాను
పొగలు సెగల పరిశ్రమలు కడుతూ ఇతను, ఉప్పెనల ముంచేస్తూ తాను
అత్యాశ దురాశ ఆక్రమణల ఇతడు, అతివృష్టి అనావృష్టి పోకడల తాను
మారణహోమాలు ఇతనివైతే విలయతాండవాలు ఆమెవి.
ఇది కాదా లెక్క తప్పిన అనులోమ విలోమ నిష్పత్తి,
ఎప్పటికి సమకూరేను ఓ శాంతియుత సహగమనం?
నిజంగానే ఇప్పటి కర్నూల్ గురించి తలచుకుంటుంటే బాధగా ఉంది. ఎప్పటికి కోలుకుంటుందో ఏమో!
Post a Comment