చల్తే చల్తే మేరి యే బాత్ నహి భూల్నా ఖభీ అల్విదా నా కహెనా . . .

Thursday, April 1, 2010

రాజమండ్రి - 1




రాజమండ్రి చాలా పురాతన మైన నగరము . ఇది వేంగీ - చాళుక్యుల పరిపాలన లో వుండేది ." వేంగీ " అంటే కోస్తా ప్రాంతం అని అర్ధం .మొదట్లో దీనిని వేంగీ అనే పిలిచేవారు . కాలక్రమేణా , రాజమహేంద్రవరం గా మార్చారు . ముఖ్యముగా రాజరాజ నరేంద్రుడు సాహిత్యాని కి , లలిత కళలకు చేసిన సేవతో ప్రాముఖ్యత పొందింది .నన్నయ , తిక్కన మహాభారతం ను తెలుగు లోనికి అనువదించినదీ ఇక్కడే !! ఈస్ట్ ఇండియా వారి కాలము లో బ్రిటిషర్స్ దీనిని వర్తకకేంద్రముగా చేసుకున్నారు . అప్పుడే రాజమండ్రి గా మారింది . కాటన్ దొర తెలుగు భాష మీద మక్కువ ఏర్పరుచుకొని , తెలుగు నేర్చుకొని , తెలుగు భాష , సాహిత్య అభివృధికి కృషి చేసాడు . గోదావరి మీద ధవళేశ్వరము మీద ఆనకట్ట కట్టించి , వర్తకాని ని వ్యవసాయాన్ని అభివృధి పరిచాడు . కందుకూరి వీరేశలింగం వంటి సంఘ సంస్కర్తలు వెలసినదీ ఈ పుణ్య భూమి లోనే . ముస్లిం ప్రభావము ఈ ప్రాంతములో లేనందున , తెలుగు సాంప్రదాయాలు , ఆచారాలూ సంస్కృతీ ఇప్పటికీ ఇక్కడ కనిపిస్తాయి . ప్రస్తుత కాలము లోనూ పర్యాటక ప్రాంతము గా తన ప్రత్యేకతను నిలబెట్టుకుంటోంది .

రాజమండ్రి చుట్టుపక్కల చూడవలసిన ప్రదేశాలు చాలనే వున్నాయి . పంచారామాలుగా ప్రసిద్ధి చెందిన ఐదు శివాలయాలలో నాలుగు , సామర్లకోట , భీమవరం , పాలకొల్లు , ద్రాక్షారామం ఇక్కడనే వున్నాయి . ర్యాలి లో జగన్మొహినీ ఆకారములో విష్ణుమూర్తి ని చూడవచ్చు . ముందువైపు , విష్ణు మూర్తిగా , వెనుక వైపు జగన్మోహినిగా విగ్రహము చాలా నైపుణ్యముతో మలిచారు . ఇక్కడ పూజారులు కూడా చాలా శ్రద్ధ గా దీపము వెలుగు లో చూపిస్తూ వివరిస్తారు . వున్న చోటినుండి , వుద్యోగములో బదిలీ కావలానుకుంటే ర్యాలీని దర్షిస్తే అవుతుందిట . కర్కోటకుడు అనే నాగు , ఈశ్వరుని ప్రతిష్టించి కొలిచిన చోటు మందపల్లి . మందపల్లి శనీశ్వరుని దేవాలయము చాలా ప్రషిద్ది పొందినది . అష్టాదశశక్తి పీఠాలలో వకటి , ద్రాక్షారామము లోని మాణిక్యాంబ . పిఠాపురములోని పురంధరేశ్వరి కూడా అష్టాదశశక్తి పీఠము లోని దేవినే . పిఠాపురం లోనే పాదగయ వుంది . ధక్షయజ్ఞము లో ఉధ్భవించిన వీరభద్రీశ్వర స్వామి వెలసిన చోటు పట్టీసం .

నాసిక్ లో పుట్టిన గోదావరి , పాపికొండల నడుమ వయ్యారం గా వంపులు తిరుగుతూ , , కోనసీమను అన్నపూర్ణ గా మారుస్తూ , రాజమండ్రి దగ్గరలోవున్న , అంతర్వేది దగ్గర సముద్రం లో కలుస్తుంది . ఈ కోన సీమ లోని గోదావరి అందం చూడవలసినదే కాని వర్ణించతరము కాదు .

ఇలా ప్రఖ్యాతి చెందిన దేవాలాయాలు రాజమండ్రి చుట్టుపక్కల చాలానే వున్నాయి . దేవాలాయాలే కాక , కోనసీమ అందాలు చూడాలంటే రెండు కళ్ళూ చాలవు .

5 comments:

అశోక్ పాపాయి said...

HI MAALAKUMAR GAARU MEERU NAA BLOG LO MEE COMMENT POST CHESHARU KADA BUT NENU KONNI RESONS VALLA CHUDALEDU ANDI .....KAANI MEEKU CHAALA CHAALA DANYAVADAMULU MAALAKUMAR GAARU....THANKS

అశోక్ పాపాయి said...

ite meeru vrasina raajamandry story entha goppaga vrasharandi....chala bagundi..telugulo vrayaleka poya sorry madam.......

శిశిర said...

మాల గారు, టపా బాగుందండి. మీరేమీ అనుకోకపోతే ఒక చిన్న సవరణ.
"కర్కోటకుడు అనే నాగు , ఈశ్వరుని ప్రతిష్టించి కొలిచిన చోటు మందపల్లి"
అన్నారు కదండి. కానీ నాకు తెలిసినంతవరకు ఇక్కడి శివుడు శనిదేవుని ప్రతిష్టఅండి. శనికి ఇంకోపేరు "మందుడు". అందుకే ఆ ఊరికి మందపల్లి అనిపేరు. ఇక్కడి శివుడు మందేశ్వరుడు. తెలిసినది చెప్పాను. అన్యధా భావించకండి.

మాలా కుమార్ said...

శిశిర గారు ,
ఇందులో అనుకునేందుకేముందండి . బహుషా కర్కోటకుడు , సవితి తల్లిని మోసం చేసినందుకు పరిహారం గా ఇక్కడ శివునికి అభిషేకం చేసి వుండవచ్చు . అక్కడి పూజారి గారు , కర్కోటకుడి కథ కూడా చెప్పారు . చాలా రోజులైంది కదా సరిగ్గా గుర్తువుండి వుండదు .
చాలా థాంక్స్ అండి .

మాలా కుమార్ said...

thank you ashok