చల్తే చల్తే మేరి యే బాత్ నహి భూల్నా ఖభీ అల్విదా నా కహెనా . . .

Tuesday, December 28, 2010

హైదరాబాద్ లో పూరీజగన్నాథుడు

ఈ మద్య మావారు అలా అలా జూబిలీ హిల్స్ లో కార్ లో నన్ను షికారు తిప్పుతూ వుండగా దూరం నుంచి మట్టిరంగులో ఓ గుడి గోపురం కనిపించింది . అరే ఇదేదో ఒరిస్సా గుడి గోపురం లావుందే అనుకొని , మావారిని అడిగాను . ఆయన ఇంతకు ముందు గమనిచలేదుట . పోనీ ఇప్పుడు వెళుదామా అనుకుంటే రాత్రి పదైంది . ఆ సమయము లో గుడి తలుపులు తీసి వుండవులే అనుకొని , ఆ గుడి ఎక్కడుందో వెతకకుండానే వచ్చేసాము . అప్పటి నుంచి ఆ గుడి చూడాలి అనుకుంటూ వున్నాను . కాని కుదరలేదు . ఈ రోజు మా అమ్మ పుట్టినరోజు . ఆమెను ఎక్కడికైన తీసుకెళ్ళాలి అనుకున్నాను . ఈ రోజు సాయంకాలం వరంగల్ కు , ఓ పెళ్ళి కి వెళుతున్నాను . అందుకని నిన్ననే , వేరే ఎక్కడికో ఎందుకు ఆ గుడికే వెళితే బాగుంటుంది అనుకున్నాను . మా డ్రైవర్ ను ఆ గుడి గురించి అడుగుతే , ఆ గుడి కడుతుండగా చూసాను మేడం .ఒరిస్సా వాళ్ళు కట్టరట అన్నాడు . అవునూ మన లక్ష్మిగారు వుండగా ఇలా ఎక్కడా ఎక్కడా అని వెతుకులాట ఎందుకు అనుకొని లక్ష్మి గారి కి ఫోన్ చేసాను . అంతే వివరాలు తెలిసిపోయాయి !

జూబిలీ హిల్స్ లో , బసవతారక రామ కాన్సర్ హాస్పెటల్ దగ్గర , ఒరిస్సా వారు , పూరీజగ్నాదుని గుడి కట్టించారు . అసలు కట్టించింది ఎవరో తెలుసుకుందామనుకున్నాను కాని ఒరిస్సావాళ్ళు అన్నారు కాని ఎవరో చెప్పలేకపోయారు . కృష్ణ , సుభద్ర , బలరామ విగ్రహాలు అచ్చం పూరీ లో వున్నట్లుగానే స్తాపించారు . గుడి గోపురము , గుడి అంతా పూరిలో వున్నట్లుగానే కట్టారు. పూజారులు కూడా ఎక్కువగా అక్కడి వారే . గుడి ప్రాంగణం మధ్యలో జగన్నాధుడు , నాలుగువైపులలో ఓ పక్క , మా విమల , ఓ పక్క మహాలక్ష్మి . జగన్నాధ గుడి ద్వారము పక్క మారుతి , వెనుక చివర వినాయకుడు వున్నారు . వినాయకుని ముందు మూషికుడు కూడా వున్నాడు .

ఆలయము గోడల మీద భక్తుల చరిత్రలు చిత్రించారు . ఆలయము లోపల పైనంతా బాంగారు రంగులో చక్కటి చిత్రాలు వున్నాయి . ఎత్తైన గోపురము , ద్వజస్తంభము కనులకింపుగా ఠీవిగా వున్నాయి . చాలా ప్రశాంతముగా వున్నది . మేము 12 గంటల వరకూ వుంటుంది అనుకొని కొంచము ఆలశ్యం గా వెళ్ళాము . మేము వెళ్ళేసరికి పావుదక్కువ పదకొండు అయ్యింది . అందువలన ఎక్కువ సేపు దర్శనం చేసుకోలేక పోయాము . కాని ఆలయప్రాంగణం లో చాలాసేపే కూర్చున్నాము .
తప్పక చూడవలసిన దేవాలయము ఇది .


అమ్మకు జన్మదిన శుభాకాంక్షలు .

7 comments:

Chakravarthy said...

మేడమ్,

మీకు ఇక్కడి మరో విషయం చెప్పాలి. ఈ గుడిలో సూర్యోదయం తరువాతే ఏదైనా వంట వండుతారు, అలాగే సూర్యాస్తమయం ముందే ముగించేస్తారు. చీకటి పడ్డతరువాత ఏమీ చెయ్యరు. ఇది వీరి సాంప్రదాయం అందుకనే వీరి గుడి యందు చీకటి వేళల్లో ఎటువంటి కదలికలు ఉండకుండా చూసుకుంటారు

gosukonda sudhakar said...

మంత్ర శాస్త్రము ప్రకారము ఆంగ్లము:
http://donotkeepyourself.blogspot.com/

durgeswara said...

చాలాబాగుందండి మందిరం

satya said...

ఆలయం బాగుంది...

కొత్త నిర్మాణాల కంటే...జీర్ణోధ్ధరణ గొప్పపని, ముఖ్యమైన పని...ముందుతరాలకి మనమిచ్చే బహుమానమది.
హైదరాబాద్ చాదర్ ఘాట్ సమీపంలో పురాతనమైన పూరీజగన్నాథుని మందిరం ఉంది...
(నిజాం ప్రాంతం లో పూరీ-జగన్నథుని ఆలయాలు అరుదు.)
ముచికుందానదీ (మూసీ) తీరప్రాంతంలో తూర్పు ముఖంగా ఉంది...
పరిసర-గుడి-మాన్యాలన్నీ దోచుకోబడ్డాయి..
కనీస కైంకర్యాలకి నోచుకోక,
కనుమరుగవుతూ,
చరిత్రాఅనవాళ్ళని
చివరిసారిగా చూపుతున్న ఆలయంఇది...(ఇలాంటి ఎన్నోఆలయాల్లో ఇదొకటి!)
-సత్య...

voleti said...

I felt very happy to see the temple pictures and story of the temple

మాలా కుమార్ said...

చక్రవర్తి గారు ,
తెలీని విషయము చెప్పారు . థాంక్స్ అండి .

&గోసుకొండ సుధాకర్ గారు ,
థాంక్ యు .

దుర్గేశ్వర గారు ,
ధన్యవాదాలు .

మాలా కుమార్ said...

సత్య గారు ,
మీరు చెప్పేవరకు నాకు ఈ ఆలయము గురించి తెలీదు .
మీరు చెప్పింట్లే నాకు కూడా జీర్ణావస్త లో వున్న , పురాతన ఆలయాలు చూసి నప్పుడు చాలా భాధ కలుగుతుంది . ఆదాయము వున్నటువంటి , పెద్ద పెద్ద దేవాలయాల ట్రస్టీ లు ఇలాంటి వాటిని ఉద్దరించవచ్చుకదా అనిపిస్తుంది .

థాంక్ యు ఫర్ ద కామెంట్ .

& వోలేటి గారు ,
థాంక్ యు అండి .