హైదరాబాద్ లో పండుగలు అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది బోనాల పండుగ.ఆషాఢ మాసము లో గ్రామదేవతలకు చేసేది ఈ పండుగ. బోనము అంటే నైవేద్యము.ఎవరెవరి మొక్కులను బట్టి వారు అమ్మవారికి నివేదన చేస్తారు.ఒకప్పుడు బలులు ఇచ్చేవారట. కాని ఇప్పుడు మటుకు అన్న నైవేద్యమే ఇస్త్తున్నారని విన్నాను.ముఖ్యముగా ఎక్కువగా ఆషాడమాసములో వచ్చే ఆదివారాలు చేస్తారు. ఆ రోజు ఉదయమే తలస్నానము చేసి శుచిగా అమ్మవారి కి నైవేద్యము-బోనము వండి అలంకరించిన కొత్తకుండ లో పెట్టుకొని, తల మీద పెట్టుకొని అమ్మవారి గుడి కి వెళ్ళి నివేదన చేస్త్తారు.కొత్త పట్టు చీరలు కట్టుకొని, చక్కాగా అలంకరించుకొని ,బోనాల కుండని తల మీద పెట్టుకొని ముత్తయిదువలూ,కన్నెపిల్లలు,కొత్త పెళ్ళికూర్తులూ వెళుతుంటే చూడటానికి రెండు కళ్ళూ చాలవు.పిల్లా పాపలు చల్లగా ఆరోగ్యముగా వుండాలని,వర్షాలు సక్రమముగా పడి పంటలు బాగా పండాలని మొక్కుకుంటారు.చివరి వారము లో సికంద్రాబాద్ మహంకాళి ఆలయము లో పెద్ద ఎత్తున చేస్త్తారు.ఆ రొజు పూజారిణి మీదకు అమ్మవారు వచ్చి భవిష్యవాణి చెపుతుందని అందరి నమ్మకము.
నేను ఒక ఆదివారము ఇంట్లోనే అమ్మవారి కి పెరుగన్నము నివేదన చేసి,ఒక కొబ్బరి కాయ,జాకెట్టు బట్ట ,పసుపు ,కుంకుమ,గాజులు దగ్గర లోని అమ్మవారి గుడి లో ఇస్త్తాను.
బతుకమ్మ పండుగ మా అత్తవారింట్లొ చేసే అలవాటు వుంది.తంగేడు పూలు,పున్నాగ మొదలైన పూలు ఒక పెద్ద పళ్ళెము లో ఆకు వేసి దాని మీద అందముగా అలంకరించి,పైన తమలపాకు లో చిన్న పసుపు గౌరమ్మ ని పెట్టి,చిన్న కొత్త బట్టలో బియ్యము రుపాయి కాసు పెడతారు . అదే బతుకమ్మ.ఎవరు ఎంత ఎత్తుగా పేరుస్త్తారు అన్నది పోటి.పల్లెటూళ్ళ లో అయితే రకరకాల పులతో చాలా కళాత్మకముగా పేరుస్త్తారు.ఆ బతుకమ్మలని మద్యలో వుంచి ఆడవారంతా చుట్టూ తిరుగుతూ,చప్పట్లు తడుతూ,కొలాటాలు ఆడుతూ ,
ఒక్కొ పువ్వేసి చందమామా అని ఒకామె పాడుతే,
పడక కుర్చీలోని ఓ రాజశేఖరా మా అన్నలొచ్చారు మమపుతారా,మీ అన్నలొస్త్తేను కోల్ మాకేమి తెచ్చారు కోల్,
అత్తకు అద్దాలా రవికా కోల్,మామకు పట్టంచు దొవ్తీ కోల్ అని ఇంకో ఆవిడ అందుకుంతుంది.
ఒకరు చెబుతుంటే మిగితావాళ్ళు గొంతు కలుపుతారు.ఈ రకముగా పూజించి చివరకు నీళ్ళ లో
పోయిరా మాయమ్మ పొయిరావమ్మా ,పొయి నీ అత్తింటనూ సుఖముగా నుండు,
మగడేమన్ననూ మారాడబోకు ,ఎవరేమన్ననూ ఎదురాడబోకూ
అంటూ సుద్దులు చెబుతూ సాగనంపుతారు.
దసరా దేవీ నవరాత్రులలో ఒకవైపు బతుకమ్మగా పూజలందుకుంటూ ,ఇంకొవైపు శంకరమఠ ము లో రోజొక అలంకరణతొ అమ్మవారు శొభిల్లుతుంటారు.
ఇవే కాకుండా వినాయకచవితి మొదలైన పండుగలు కుడా జరుపుతారు.కాని ఇవి ఇక్కడి సాంప్రదాయ పండుగలు. ఈ పండగలప్పుడు సందడి చూడాలంటె బర్కత్పురా,చిక్కడపల్లి,అశోకనగర్ ,నల్లకుంట,విద్యానగర్ లలో చూడాలి.ఇవి మా ఇలాకాలు.అందుకని నాకు ఇక్కడి సంగతే తెలుసు.నల్లకుంట ,చిక్కడపల్లి మార్కెట్ల లో అయితే పండగలప్పుడు మొగలి పూలు,కలవ పూలు కుడా దొరుకుతాయి.
ఇక గుడుల విషయాని కి వస్త్తే మాకు చిక్కడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయము చాలా అలవాటు.మా ఇంట్లొ కొత్తదంపతులు ముందుగా దర్షించుకునేది ఈ స్వామినే.మా కుటుంబము లోని పిల్లల అన్నప్రాసన,అక్షరాభ్యాసము,పుట్టివెంటుకలు అన్ని ఇక్కడే.
ఈ పరిసరాలన్ని ఎక్కువగా మద్యతరగతి వారు నివసించేవి.భాధ్యతలు తీరి,రిటైర్ అయిన నడివయసు దంపతులు ఇక్కడ సుఖంగా నివసించే అవకాశాలు ఎక్కువగా వున్నాయి.ముఖ్యముగా చిక్కడపల్లి లో ఐతే పొద్దున్నే సుధా హొటల్ నుంచి టిఫ్ఫిన్ తెచ్చుకొని,మధ్యహ్నము బందరు మిఠాయి దుకాణములో ఓ నాలుగు సీసాలు ఇస్త్తే కమ్మటి పచ్చడులు ఇస్త్తాడు -వాటిలోకి వేడి అన్నము వండుకొనితినేసి,సాయంకాలము పక్కనే వున్న ఏ థియేటర్ లో సినిమానో,లేదా త్యాగరాయగానసభ లో ఏ ప్రోగ్రామో చూసేసి ,అదీ కాదంటే సత్యనారయణ స్వామి గుడిలో పురాణ కాలక్షేపాని కో వెళ్ళివస్తూ హాయిగా ఏ చికూ చింతా లేకుండా గడపవచ్చు.
ఇలా నల్భై సంవత్సరాలనుండి మెట్టినిల్లు,పది సంవత్సరాలనుండి పుట్టిల్లు కుడా అయినా మా హైదరాబాద్ గురించి ఎంత చెప్పినా ఇంకా ఏదో చెప్పాలనే వుంది.కాని ఎంతని చెప్పను?ఒక షహెరి (ఉర్దూ కవిత) ఐనా చెప్పకుండా ఆపేస్తే అసంపుర్తిగా వుంటుంది.మా ఫ్రెండ్ ప్రభ ఈ షెహారీ లు చెప్పటము లో దిట్ట.ఆమె చెప్పిన ఒక చిన్న షెహరి,
ఉత్తరాలు రాయటాని కి బద్దకించిన ప్రియుడి తో ప్రియురాలు,
యా ఇలాహి,క్యా సబబ్ హై,
మొహబత్ ఖతం హై,
యా ఢాఖానా బంద్ హై

5 comments:
Mala kumar garu chala bavundi.kalla mundu jarugutunnattuga undi.Elanti post lu rayadam lo meru chala experts andi doubt ledu. itlu saila bala ane mee Ac
శైలబాల గారు ,
ఏమి రాశారండి :) ముందు మీరు రాసింది అర్ధం కాలేదు . రెండోసారి చదివాక అర్ధం అయ్యింది .
ఓ హో ఆహా హా మీరు నా ఏ.సి నా ? బాగుంది మీరు నా ఏ.సి నేను మీ ఏ. సి . హి హి హి హి
$మాల గారు
టపా బాగా రాసారు. నేను హైద్..లో ఉన్నప్పుడు చాలా సాంప్రదాయాల(పండగ)ని చూసా.. మా ఇంటి యాజమానురాలైతే పండగోచ్చినప్పుడు ఇంటికీ ఆడబిడ్డలందరినీ.. ఓ పది మంది..ఇక వాళ్ళ పిల్లలు..పిలిచేది. సందడి సందడి.. కొత్తాపాతా లేదు. ఏం బిడ్డా, బాగుండవా.. అంతా నిమ్మళమేనా అని... ఆపైన తాయిలాలు :)
కానీ ఆ సాంప్రదాయాల పేర్లు అంతగా తెలీదు..
మీరు చక్కగా వివరించారు. ధన్యవాదాలు _/\_
#...మీరు నా ఏ.సి నేను మీ ఏ. సి ..
:> :-D %)
మీ ఏ.సి అభిమానాలు భలే బావున్నాయి.. అసలే ఎండలకాలమూ :)
ఎండలప్రాయం..నాకొక ఏ.సీ కావాలి అని పాడుకోవాలేమో నేను ;)
రాజేష్ గారు ,
అవునండి , ఇక్కడ బోనాలప్పుడు చాలా సందడిగా బాగుంటుంది . గ్రామ దేవతల గుళ్ళన్నీ కళ కళ లాడుతూ వుంటాయి .
అసలే ఈ ఎండాకాలం ఏ.సి చల్లదనం సరిపోవటమే లేదు . ఇక మీరూ పోటీకి వస్తున్నారా ?
థాంక్స్ అండి .
నాకు అత్యంత ఇష్టమయిన బోనాల పండుగ గురించి వ్రాసినందుకు మీకు ధన్యవాదాలు మాలా గారు. నిజమే, యీ పండుగ చీకటి పడ్డాక తిలకించడానికి వేయి కళ్ళున్నా సరిపోవు..ప్రస్తుతానికి ఈనాడు లో వచ్చే బోనాల పండుగ ఫొటొస్ కోసం ప్రతి సంవత్సరం వెయిటింగ్...వెయింటింగ్ అండ్ వెయిటింగ్....
ఇంక బతుకమ్మ సంగతి చెప్పక్కరలేదు..'ఉష్కెల (ఇసుకలొ) పుట్టే గౌరమ్మ, ఉష్కెల పెరిగే గౌరమ్మ, పొన్నగంటి రాళ్ళు, పోకలగంటి నీళ్ళు............థాంక్స్ మాలా గారు
Post a Comment