చల్తే చల్తే మేరి యే బాత్ నహి భూల్నా ఖభీ అల్విదా నా కహెనా . . .

Saturday, October 3, 2009

కర్నూలు1991 లో కర్నూల్ కు మావారు పని మీద వెళుతుంటే నేను ,పిల్లలు కూడా వెళ్ళాము. మల్లాది ఏదో నవల లో కొండా రెడ్డి బురుజు గురంచి చదివినప్పటి నుండి , అది చూడాలని కోరిక వుండింది. మావారు పని లో వుండగా నేను , మా అమ్మాయి , మా అబ్బాయి కర్నూల్ అంతా తిరిగాము. అక్కడ నేను చూద్దామనుకున్న కొండారెడ్డి బురుజు దగ్గర చాలా సమయము గడిపాము. దాని వెనుకననే పోలిస్ స్టేషన్ వున్నట్లు గుర్తు.
ఆ తరువాత తుంగభద్ర దగ్గర సాయిబాబా గుడి లో కొద్దిసేపు వున్నాము.
ఇకపైన చూసేందుకు ఏమీ లేవన్నారు అక్కడి హోటల్ సిబ్బంది. మేమున్న హోటల్ కి దగ్గరలో వున్న సినిమా హాల్ లో వెంకటేశ్ , భానుప్రియ నటంచిన శ్రీనివాస కల్యాణం సినిమా చూసాము.

నిన్నటి నుండి టి . వి లో కర్నూల్ ను చూస్తూవుంటే అప్పుడు మేము చూసిన కర్నూల్ గుర్తుకువచ్చి చాలా బాధ కలుగుతోంది. ఆ రోజు మేము తిరిగిన కొండా రెడ్డి బురుజు కు ,ఈ రోజు పేపర్ లో చూసిన కొండారెడ్డి బురుజుకు తేడ చూస్తూవుంటే మనసు తరుక్కు పోతోంది !
కన్నతల్లి లా అక్కున చేర్చుకునే నదీమతల్లి ఆగ్రహిస్తే పరిస్తితులు ఎంత దారుణముగా వుంటాయోకదా ! ఎంత ఎత్తుకు ఎదిగినా మనిషి ప్రకృతి ముందు తలదించవలసినదేకదా !