చల్తే చల్తే మేరి యే బాత్ నహి భూల్నా ఖభీ అల్విదా నా కహెనా . . .

Wednesday, March 9, 2011

కట్ట మైసమ్మ దేవాలయముసెక్రటేరియట్ దగ్గరి ఫ్లైఓవర్ నుంచి ఇందిరాపార్క్ వైపుకు వెళ్ళేటప్పుడు , ఫ్లైఓవర్ ఐపోగానే ఎడమ వైపు వుంటుంది ఈ దేవాలయము . ఇది దాదాపు 450 సంవత్సరాల క్రితముదట . హుసేన్ సాగర్ కు కట్ట కట్టేందుకు తవ్వుతుండగా అమ్మవారి విగ్రహము కూలీల కంట పడిందట . ఆ విగ్రహాన్ని అక్కడే స్తాపించి , కట్ట తవ్వుతుండగా వెలసిన అమ్మవారు కాబట్టి " కట్ట మైసమ్మ " అని పూజించారట . ఆ తరువాత ఎండొన్మెంట్ వారి ఆద్వర్యము లో గుడి కట్టించి సిమ్హవాహినిగా అమ్మవారి విగ్రహమును స్తాపించారట . మూల విగ్రహమును శ్రీచక్రము వద్ద వుంచారట . ఈ విషయాలు అక్కడి పూజారి గారు చెప్పారు . మూల విగ్రహమును కూడా చూపించారు .

ఈ దేవాలయానికి మొదటి సారిగా మా వియ్యపురాలిగారి తో వెళ్ళాను . అంతకు ముందు అట్లాంటా లో , మా మనవరాలు పుట్టేసమయము లో , నా కలలో కనిపించిన అమ్మావారు ఆమే నని గ్రహించి చాలా ఆశ్చర్య పోయాను . అంతే కాకుండా అప్పుడు నాకు కలలో జరిగినట్లే గుడి లో కూడా అనుభవము కావటము నమ్మలేని నిజము ! ఆ తరువాత మా రెండో మనవరాలు పుట్టినప్పుడూ కల లో దర్శనం ఇచ్చింది అమ్మవారు . ఆవిడ దర్శనమిచ్చిన మరునాడే మా కోడలు ఎక్స్పెక్టింగ్ అని తెలిసింది ! ఈ మద్య మూడు నెలలుగా ఆరోగ్యం ఇబ్బంది పెడుతోంది . పోయిన సోమవారము సాయంకాలము కూరున్న దానిని కూర్చున్నట్లే లేచి , అమ్మవారు పిలిచినట్లుగా ఈ గుడికి వెళ్ళాను . కాని నిలబడలేక , ఎలాగో కుంకుమార్చన చేయించుకొని , దగ్గర లోనే వున్న మా అమ్మాయి ఇంటికి వెళ్ళాను . మా అమ్మాయి వెంటనే , రేపు డాడీ తో వెళుతాను అన్నా వినకుండా డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళింది . ఆయన నేను ఇన్ని రోజులు నిర్లక్షం చేసినందుకు బాగా కోపం చేసి మెడిసన్ ఇచ్చారు . ఆ రోజు అలా డాక్టర్ దగ్గరకు వెళ్ళి చూపించుకొని ఆరోగ్యం బాగు చేసుకోమని చెప్పకనే చెప్పింది అమ్మవారు అనిపించింది . ఈ రోజు ఇలా వున్నాను అంటే ఆ అమ్మ దయే . నాకు ఇలా చాలాసార్లు అనుభవము కలిగింది . కట్ట మైసమ్మ చాలా పవర్ఫుల్ దేవత అని నాకు అనిపిస్తుంది .

ఈ దేవాలయము లో అన్నదానము చేసే వసతి కూడా వున్నది . మనము చెప్పిన రోజు అన్నదానము చేస్తారు . మనమిచ్చిన డబ్బుల తోనే అనుకోండి . మనకు కావలసిన రోజు , కావలసిన వారి పేరు మీద ఆ రోజు ఇందిరా పార్క్ లో ఏర్పాటు చేస్తారు . కావాలంటే మనము కూడా భోజనము వడ్డించ వచ్చు .