Wednesday, February 9, 2011
శ్రీ మహేశ్వరం క్షేత్రం
ఈ మద్య లక్ష్మి గారి ఫ్రెండ్షిప్ లో పురాతన దేవాలయాలు చూడాలని అనిపించి , అప్పుడప్పుడు నేనూ , లక్ష్మి గారు మా అమ్మా వెళ్ళి వస్తున్నాము. అలా పోయిన వారం శ్రీశైలం వెళ్ళి వచ్చాము . శ్రీశైలం ఇంతకు ముందు చాలా సార్లే వెళ్ళాను కాని చుట్టు పక్కల ఒక్క ఉమా మహేశ్వరం తప్ప ఇంకేదీ చూడలేదు . ఈసారి త్రిపురాంతకం చూద్దామని వెళ్ళాము . ఉదయమే 7 గంటలకు మా కార్ లో , నేను , లక్ష్మి గారు , మా అమ్మ , మా డ్రైవర్ మల్లేష్ సారధ్యం లో బయలుదేరాము . లక్ష్మి గారు బ్రేక్ ఫాస్ట్ , నేను లంచ్ పాక్ చేసుకొచ్చాము . పొద్దున్నే హైదరాబాద్ ట్రాఫిక్ నుంచి బయట పడేందుకే రెండు గంటలు పట్టింది . సిటీ ఔట్స్కర్ట్ దాటాక బ్రేక్ ఫాస్ట్ కానిచ్చాము .
హైదరాబాద్ శం షాబాద్ ఏర్పోర్ట్ రోడ్ దాటి హైవే మీద శ్రీశైలం దిశగా వెళ్ళేటప్పుడు , దాదాపు 30 కిలోమీటర్లు దూరం లో వున్నది ' మహేశ్వర ' క్షేత్రం . పూర్వ కాలం లో ఋషులు , మానవులు , దేవతలు తమ కష్టాల నుంచి రక్షించమని శివుని ప్రార్ధిస్తూ తపస్సు చేయగా వారికి ప్రత్యక్షమై వారి కోరికలను తీర్చటమే గాక , వారి కోరిక మేరకు ఇక్కడి పుష్కరిణి లో రాజరాజేశ్వరుడి గా వెలిసాడు . ఇక్కడ పై దేవాలయము లో రాజరాజేశ్వరుడు , ఆ దేవాలయమునకు కిందిభాగములోని దేవాలయము లో రాజరాజేశ్వరి దేవి పూజలందుకుంటున్నారు . ఈ ఆలయము చుట్టూ షోడశ మూర్తులు అంటే పదహారు శివ రూపాలు ప్రతిష్టించారు . ఆలయము ముందు రావి చెట్టు నీడలో వినాయకుడు , నాగదేవతల గుడులు చిన్నవి వున్నాయి . అవి బహుషా ఈ మద్యకాలము లో నిర్మించివుంటారు . మహేశ్వరములోని చారిత్రిక కట్టడాలు 13 వ శతాబ్ధం లో కాకతీయుల కాలము లో నిర్మించినట్లుగా ఆధారాలు వున్నాయి . ఐతే తరువాత పాలించిన కుతుబ్ షాహీ రాజులు కోటను పొడిగించినట్లు చరిత్ర లో వున్నది . క్రీ. శ. 1672 కు పూర్వము మహేశ్వరం ప్రాంతమంతా దట్టమైన అడవుల తో నిడి వుండేదట . పరిసర ప్రాంతాలలో చెప్పుకోదగిన పెద్ద గ్రామాలేవీ లేకుండెనట . తానీషా కాలం లో అక్కన్నమాదన్నలచే ఆకర్షింపబడి శివకేశవలయాల నిర్మాణానికి , గ్రామ నిర్మాణానికి కారణమైనదట . ఈ క్షేత్ర నాయకుడు మహేశ్వరుడు కనుక ఆయన పేరునే ఈ గ్రామానికి మహేశ్వరము అనే పేరు వచ్చిందట .అక్కన్న మాదన్నలు ఈ ఆలయాన్ని పునరుద్ధరించి , మిగితా ఆలయాల నిర్మాణానికి పూనుకున్నట్లుగా ' అక్కన్నమాదన్నల చరిత్రలో ' వున్నదట .
రాజరాజేశరుని , రాజరాజేశ్వరినీ దర్శించుకొని , అర్చన కుంకుమార్చన చేసుకున్నాము . రాజరాజేశ్వరి ఆలయములో ఓ చిన్ని పూజారి మా తో శ్రీచక్రమునకు కుంకుమార్చన చేయించారు . ఆ పూజారి మమ్మలిని దీవించాడు కూడా .
అక్కడి నుంచి తిరిగి శ్రీశైలం కు బయలుదేరాము . శ్రీశైలము లో మల్లికార్జునస్వామి మందిరమునకు దగ్గరలో వున్న ' వాసవీ సత్రము ' లో రూం తీసుకున్నాము . అక్కడే భోజన సదుపాయము కూడా వున్నది . రాత్రి 9 గంటలకు మల్లికార్జునస్వామి ని దర్శించుకున్నాము . ఆ రోజు ఆలయము లో మా అదృష్టము ఎక్కువగా రెష్ లేదు . మేము ఏ క్యూలోనూ నిలబడ కుండానే నేరుగా గర్భ గుడి వరకు వెళ్ళగలిగాము . చాలాసేపు స్వామివారిని దర్శించుకున్నాము . బ్రమరాంబ అమ్మవారిని కూడా దర్శించుకొని చాలాసేపు ఆలయప్రాంగణములో కూర్చున్నాము .
Subscribe to:
Post Comments (Atom)
3 comments:
this slide show is very good mala gaaru...
ఎన్నెల గారు ,
థాంక్స్ అండి .
మహేశ్వరం చాలా గొప్ప దేవాలయం. పక్కనే ఒక 6-7 కిలోమీటర్ల దూరంలో ఆంజనేయ స్వామి గుడి ఉంది. చాలా ప్రశస్తి కలిగిన గుడి. చాలా బావుంటుంది.
Post a Comment