చల్తే చల్తే మేరి యే బాత్ నహి భూల్నా ఖభీ అల్విదా నా కహెనా . . .

Tuesday, May 19, 2009

పోరుబందర్


భారతీయులకు కాశీ,తిరుపతి లాగే పొరుబందర్ కూడా పుణ్యస్తలము.అహింసా వాదము తో రవి అస్తమించని బ్రిటిష్ వారిని గడగడలాడించిన అసింసావాది గాంధి మహాత్ముడు జన్మించిన పుణ్యప్రదేశము.తన జీవన శైలి తో అందరూ ఎంత నిరాడంబరము గా వుండాలో,చెడు వినవద్దు,చెడుచూడవద్దు,చెడు మాట్లాడవద్దు అని అందరికి భోదించిన మహనీయుని జన్మ స్తానము. భారతీయులందరు కనీసము వక్కసారైనా దర్షించవలసిన ప్రదేశము పోరుబందర్.ఆ మహనీయుని గృహములోనికి వెళుతుంటే నే చెప్పలేని భావన కలిగింది.ఒక దేవాలయములోనికి వెళుతున్నట్లుగానే భావించి మహాత్ముని మన్సులోనే స్మరించుకున్నాను. ఆయనను ప్రత్యక్షముగా చూడలేకపొయినందుకు చాలా బాధ కలిగింది. లోనికి వెళుతుండగా నా చిన్నప్పుడు స్కూల్ లో పాడిన పాట "భలే తాత మన బాపూజీ ,బాలల తాతా బాపూజీ" పాట గుర్తుకువచ్చింది.గాంధీజీ ఇల్లు చాలా పెద్దగా వుంది.చిన్న చిన్న గదులు ,వాటికి చిన్న చిన్న కిటికీలు మొత్తము ఇల్లు చూడటానికి చాలా సమయము పట్టింది.ఆయన ఇంటికి ఎదురుగానే కస్తూరీబా ఇల్లు వుంది.ఈ పక్కన వున్నది గాంధీజీ ఇల్లు.వెనుకగా చిన్న చిన్న నల్ల కిటికీ లు కనిపిస్తున్న ఇల్లు కస్తూరిబా పుట్టిల్లు.హరికథ లో పిట్టకథలా ,కస్త్తూరీబా గది,గాంధీజీ గది ఎదురెదుగా వుండేవని ,వారి గది కిటికీలనుండి చూసుకుంటూ ఇద్దరూ ప్రేమించుకుని వివాహమాడారని గైడ్ గాంధీజీ ప్రేమకథ చెపాడు.

పోరుబందర్ నుండి దండి వెళ్ళాము.అది ఒక చిన్న పల్లె.అక్కడ సముద్రము నుండి నీరు తీసి మడులలో ఎండపెట్టి ఉప్పును తయారు చేస్తారు.దాని ని విదేశాలకు కూడా ఎగుమతి చేస్తారు.అక్కడి ప్రజలకు అదే జీవనాధారము.గాంధీజీ ఉప్పు సత్యాగ్రహమును ప్రారంభించింది ఇక్కడే.

పోరుబందర్ నుంచి తిరుగు ప్రయాణమయ్యాము.కొద్ది దూరము వెళ్ళగానే మాధవపురం అని బొర్డ్ కనిపించింది.దానిని చూడగానే పిల్లలు డాడీ నీపేరు మీద వూరుంది అన్నారు .మా వారిని ఇంట్లో పెద్దవాళ్ళు మాధవా అని పిలుస్తారు.వెంటనే కార్ ఆపి ఇక్కడ ఎమిటి ప్రత్యేకము ఈపేరుంది అనిదారి లో ఒకరిని అడిగాము. ఇక్కడ శ్రీకృష్ణుడు నిర్యాణము చెందారని ఆ ప్రదేశము చూపారు.పక్కన కనిపిస్తున్నది శ్రీకృష్ణుడు నది పక్కన , కూర్చొనివుండగా బోయవాడు ఆయన బొటనవేలిని పక్షి అని భ్రమపడి, భాణముతో కొట్టిన వృక్షమని స్తానికులు చెప్పారు.దానిని వాడి పోకుండా ఇన్ని సంవత్సరాలనుండీ ఇలా దడి కట్టి కాపాడుతున్నామని చెప్పారు. ఇంకా ఇక్కడ ఇలాటి ప్రత్యేకమైన వూరులు ఏమి వున్నాయి అని అడిగితే ఇంకొంచము ముందు సత్యభామ ,శ్రీకృష్ణుని తో నరకాసురుని మీదికి యుద్దానికి బయిలుదేరిన పల్లెని చూపారు.అక్కడ శ్రీకృష్ణుడు ,సత్యభామల దేవాలయము వుంది.అక్కడ చుట్టుపక్కల అన్ని పల్లెలూ ఎదోవిధముగా శ్రీకృష్ణుని గాధలతో ముడిపడి వున్నాయి.


ఆ పల్లెలన్నీ చూసుకుంటూ వెళుతుండగా మద్యాహ్నమైంది. భొజనము కోసము చూస్తే ఎక్కడా హొటల్స్ లేవు.మొతానికి ఒక ముసలామె సొజ్జరోటీ లు చేసిస్తుందని తెలిసి ఆమెను వెతుక్కుంటూ వెళ్ళాము.అప్పటికి ఆమె దగ్గరకూడా అయిపొయాయి పైగా పిల్లలు మేము సొజ్జరోటీలు తినము అని గొడవ.మావారెమో మా నాయనమ్మ మాకు చిన్నప్పుడు జొన్న రొట్టెలు ,జొన్న అన్నము పెట్టేది నేనెప్పుడు సొజ్జరొట్టెలు తిన్లేదు తిందాము అని మొత్తానికి పిల్లలే గెలిచారు .ఆవిడ గోధుమ పిండి కొనుక్కొని వచ్చి గోధుమ రొటీలు,బటాఖా (ఆలూ)సబ్జీ చేసి ఇచ్చింది.అవి తీసుకొని రోడ్ పక్కన కార్ ఆపి తినపొయేంతలో ,పక్కన వున్న పొలము లోనుంచి రైతు వచ్చి వాళ్ళ పొలములో తినమని ఆహ్వానించాడు.లోపల రావి చెట్టుకింద నులక మంచాలు వేసి,నాలుగు సొజ్జరొట్టెలు.పచ్చడీ, మంచినీరూ తెచ్చి ఇచ్చాడు. అందరమూ తిని, హాయిగా ఆ చల్ల గాలికి పడుకున్నాము.మేము బయిలుదేరెసరికి పెద్ద,పెద్ద బంగారంలా మెరుస్తున్న ఇత్తడి గ్లాసుల నిండా చాస్ పీవో అంటూ మజ్జిగ ఇచ్చాడు.డబ్బులివ్వబోతే తీసుకోలేదు.ఆ రొజు ఆ అవ్వ ఇచ్చిన రొట్టెలు, ఆ రైతు ఆథిద్యమూ మరువలేనివి.సౌరాస్ట్ట్రీయులు సహృదయులు అనుకున్నాము.


ఇది జునాగడ్ లోని ప్రసిద్ద మసీదు.పూర్తిగా మొగలాయుల తరహాలో కట్టారు.చక్కని లతలు పూలతో చెక్కారు.దీని వెనుకనుంచి జునాగడ్ కోటకి దారి వుంది.కోట ఎక్కే సరదా లేకపోయింది,అంతే కాక చీకటి కూడా పడుతుండటముతో ముందుకు సాగాము. కొంచము దూరము వెళ్ళగానే చిన్న సిటీ కనిపించింది.అక్కడినుంచి బరోడా నాలుగైదు గంటలుంటుందని తెలియటములో ఆ రాత్రి అక్కడే బస చేద్దామనుకున్నాము.



సరైన ప్రదేశము కొరకు వెతుకుతుండగా దగ్గరలో జలారాం సత్రముందని చెప్పారు.జలారాం అక్కడి
పేరుపొందిన సాధువు.ఆయన దేవాలయములోనే ఉచిత సత్రము భోజన వసతులతో వుంది.అందరమూ హొటల్ కి వెళుదామని గొడవచేసినా మా వారు వినకుండా అక్కడే బస చేయించారు. ఆ రాత్రి అక్కడే వుండి వుదయము జలారాముని దర్షనము చేసుకొని ముందుకు సాగాము.ఆ రాత్రి మాకు నీడనిచ్చిన జలారాముడు ఈయననే.అక్కడినుంచి బరోడా నాలుగైదు గంటలే అన్నారు కా ని ఆరోజంతా పట్టింది.మావారు చాలా ఆందోళనగా కనిపించటముతో ఎమిటి అని అడిగితే పెట్రోల్ అయిపోతోంది అన్నారు. ఐతే దారి లో పోయించండి అన్నా !ఆ తెలివి లేకే వూరుకున్నానా పైసలుకూడా అయిపోయాయి అన్నారు.సగము అహ్మదాబాద్ లో నీ షాపింగ్ కే అయిపొయాయి.అందుకే రాత్రి సత్రములోవుంది.అన్నారు.బాగుంది ,యాత్ర మొదట్లో గెస్ట్ హవుస్ లో చివర సత్రములో.పొనీయండి నా గాజులన్నాయి,చెవి రింగులున్నాయి అన్నాను.వుంటే ఈ అడివిలో ఈ రాత్రివేళ ఎవరు కొంటారు అంగానే ఎట్లా డాడీ అని పిల్లలు ఏడుపు మొహం పెట్టారు .ఎంచేద్దాం జయ్ జలారాం,జై జై జలారాం అని భజన చేయండి థౌసండ్ టైమెస్ కాగానే బరోడా వచ్చేస్తుంది అన్నారు .అంతే భజన మహిమో ఇంకొటో కాని రాత్రి పదకొండుగంటలకి ఇంటికి క్షేమం గా చేరాము.జై జల్లారాం జయ్ జయ్ జలారాం .

ఈ ప్రయాణము 1983 డిసెంబర్ మొదటివారము లో చేసాము.అందువలన అన్ని ప్రదేశముల పేరులు గుర్తులేవు.కార్ లో ప్రయాణిచటము వలన చిన్న చిన్న ప్రదేశాలు కూడా చూడగలిగాము.ఇన్ని సంవత్సరాలు జరిగినయి ,ఇప్పుడు ఆప్రదేశములు మారివుండవచ్చు లేదా చారిత్రాత్మకము అయినవి కాబట్టి మారకపొనూవచ్చు.


చల్తే చల్తే మేరి ఏ బాత్ యాద్ రఖనా కభి అల్విదా నా కహనా

12 comments:

సిరిసిరిమువ్వ said...

మీ ప్రయాణంలో పదనిసలు బాగున్నాయి. ముచ్చటగా మూడు బ్లాగులు వ్రాస్తున్నారన్నమాట. Keep it p.

మాలా కుమార్ said...

థాంక్ యు శ్రీ,
మీ అందరి ప్రోత్సాహము వలనే రాయగలుగుతున్నాను

భావన said...

మాల గారు చాలా బాగుంది మీ ప్రయాణపు వివరాలు. అవును గాంధి జి పుట్టిన వున్న స్థలం చూడటం గొప్ప అనుభూతి కదా. మీరు ఫొటో లుకూడా పెట్టినందుకు థాంక్స్. ఇంతకు అహ్మదాబాద్ లో ఏమేమి షాపింగ్ చేసేరేమిటి జేబులు ఖాళీ అయ్యేంత.. అక్కడ బూడిద గుమ్మడి కాయ చేసిన స్వీట్ ఏదో వుంటుది బాగుంటుంది కదు...

మాలా కుమార్ said...

భావన గారు,
అహ్మదాబాద్ లో ఏమి షాపింగ్ చేసానో దీనికి ముందు టపా చూడండి.జేబులు ఖాళీ అయినా నేను మటుకు మా అమ్మాయికి బోలెడు డ్రస్స్ లు కుట్టాను.థాంక్స్ అండి

Jahnavi said...

మాల గారు చాలా బాగా కళ్లకు కట్టినట్టు చెప్పారు. ఎప్పుడో 83 లో చేసిన ప్రయాణం మీకు గుర్తు ఉందా అండీ ?

మాలా కుమార్ said...

జాహ్నవి గారు,
మీకు నచ్చినందుకు థాంక్స్ అండి.అలా అలా గుర్తున్నాయండి.ఆ చిన్న చిన్న పల్లెల పేర్లు,జలరాం వూరు పేరు ఎంత గుర్తుచేసుకున్నా రాలేదు.ఎదో రాసేసాను.వివరాలు అడిగితేచెప్పలేను.

సుభద్ర said...

chala chalaa baagaa rasaru.
ani gurtu chesukuntuuu super.
nenu 2000lo gujath vellanu.
inka gandhigaari intiki nenu gurtu chesukunna
anni

మాలా కుమార్ said...

thankyou subhadra gaaru

మాలా కుమార్ said...

వరూధిని గారూ,
ధన్యవాదములు.

psm.lakshmi said...

బ్లాగు మొదలుపెట్టకమునుపు నేను ద్వారకు, అహమదాబాద్, గాంధీగారు ఇల్లు చూశాను. బ్లాగు మొదలెట్టాక అనుకున్నాను అరె వాటికి మళ్ళీ వెళ్ళాలి అని.
ఇవాళ మళ్ళీ గుర్తు చేసుకున్నాను.
psmlakshmi

Anonymous said...

నేను సౌరాష్ట్రలో పని చేసినప్పుడు దియ్యు, సోమనాథ్, పోరుబందరు, ద్వారక, జునాగఢ్, పాలీతానా, రాజకోట్ మొదలైనవి చూసాను.
అవన్నీ గుర్తు చేసినందుకు థాంక్స్.
జలారాం ఉరి పేరు ఖొడియార్ అనుకుంటాను నేను చూడలేదు.

మాలా కుమార్ said...

laxmigaaru, bonagiri gaaru,

thanks andi