Saturday, February 12, 2011
శ్రీ త్రిపురాంతక క్షేత్రం
సాయంకాలము మల్లికార్జునుని దర్శనం చాలా బాగా జరిగినందున చాలా తృప్తి గా అనిపించింది . మరునాడు ఉదయమే టిఫిన్ పని కానిచ్చుకొని , త్రిపురాంతకం బయిలుదేరాము . శ్రీశైల శిఖర దర్షనము నుండి కుడి వైపు ఘాట్ రోడ్ మీదు గా వెళితే శ్రీ త్రిపురాంతక క్షేత్రం వస్తుంది . వూరి లోని కి ప్రవేశించగానే ముందుగా త్రిపురాంతకీశ్వరుని దేవాలయము . కొద్దిగా కొండమీదికి ఎక్కి వెళ్ళాలి . ఇక్కడ పూర్వము త్రిపురాంతకుడు అనే రాక్షసుని ఈశ్వరుడు వధించి , ఇక్కడే వెలిసినందు వలన , ఈ దేవాలయము లోని స్వామిని శ్రీ త్రిపురాంతకేశ్వరుడు అని అంటారు .
ఈ దేవాలయములో పురాతన శాసనాలు , శిల్పాలు చాలానే వున్నాయి . కాని శిధిలవస్తలో వున్నాయి . ఆ శాసనాలు తెలుగులో లేవు . మరి ఆ భాష ఏమిటో నాకు అర్ధము కాలేదు . కాపోతే స్పష్టం గా కూడా లేక , చెక్కుకు పోయి వున్నాయి . బహుషా అందువలన కూడా అర్ధం కాలేదనుకుంటాను .
దేవాలయములో ఓ పక్కగా చిన్న గది వుంది . దానిలో నుండి , ఇష్టకామేశ్వరి దేవాలాయానికి , సొరంగ మార్గము వుందిట . దాని ని మూసి వుంచారు .
ఈశ్వరునికి అభిషేకము చేయించుకొని , కాసేపు కూర్చున్నాము . ఆ తరువాత అక్కడి నుంచి శ్రీ బాలాత్రిపురసుందరి దేవాలయాని కి వెళ్ళాము .
శ్రీ బాలాత్రిపురసుందరి దేవాలయము చాలా ప్రశిస్తి కలది . ఇక్కడ ఋషులు యాగము చేస్తుండగా , యజ్ఞగుండము నుంచి దేవి బాల రూపములో అవతరించింది .షోడశకళలతో అమ్మావారు బాలగా స్వయంభూగా వెలిసారు . ఆ మూర్తి లోని తేజస్సును ఎవరూ చూడలేకపోయారుట . శ్రీ ఆదిశంకరాచర్యులవారు , ఆ మూర్తిలోని 30 కళలను నిక్షిప్తము చేసారట . ఆ తరువాత వేరొక మూర్తిని , శ్రీచక్రమును అక్కడ స్థాపించారట . ఈ విగ్రహము పాత విగ్రహానికి ముందుగా వుంటుంది . ఇక్కడే శంకరాచార్యులవారు ' శ్రీ లలితా సహస్రనామాల ' ను వెలుగులోకి తీసుకొచ్చారట .
ఆలయ ప్రాంగణము లో ఒకప్పుడు వరుసగా కదంబ వృక్షాలు వుండేవట . ప్రస్తుతము ఒకటే వుంది . పక్కగా ఓ పెద్ద పుట్ట వుంది . అందులో పెద్ద పాము వుందని , అది రోజూ రాత్రి పూట ఆలయములోని అమ్మావారి విగ్రహం దగ్గరకు వెళుతుందని అక్కడి వాచ్ మాన్ చెప్పాడు !
వర్షాకాలము లో ఈ దేవాలయము నీటిలో మునిగిపోతుందట. అప్పుడు కొద్ది దూరములో వున్న ఇంకొక దేవాలయములో అమ్మవారి విగ్రహము వుంచి పూజిస్తారట .
మేము అమ్మవారి ముందు కూర్చొని లలితాసహస్రనామ పారాయణము చేసుకున్నాము .
తిరిగి వస్తూ శ్రీశైలం దగ్గరనే వున్న హటకేశ్వరం కూడా వెళ్ళాము . కాని గుడి తలుపులు మూసి వున్నందున , కటకటాల లోనుచే ఈశ్వరుని దర్శించుకొని వచ్చేసాము . సాయంకాలం మరోసారి మల్లికార్జున స్వామిని , బ్రమరాంబ అమ్మవారి ని దర్శించుకున్నాము .
మరునాడు ఉదయము రోప్ వే ఎక్కాము . నాకైతే కొంచం భయం వేసింది :) కృష్ణ లో అప్పటికి ఇంకా బోటింగ్ మొదలు కాకపోవటముతో రోప్ వే తో సరిపెట్టి , అక్కడి నుంచే కృష్ణమ్మ అందాలను చూసి వచ్చేసాము .
ఇహ రూం కు తిరిగి వచ్చి సామాను సద్దేసి తిరుగు ప్రయాణమయ్యాము . మరి వచ్చేస్తూ సాక్షి గణపతి దగ్గర హాజరు వేయించుకొవాలిగా . అదీ చేసాము . వూరికే దండం పెట్టుకోవటము కాకుండా గోత్రనామాలు చెప్పుకొన్నాము .
అక్కడ నుంచి కొద్ది దూరములో వున్న స్వామి పూర్ణానంద అశ్రమానికి వెళ్ళాము . మేము వెళ్ళిన సమయములో పూర్ణానంద స్వామి వారి కి హారతి జరుగుతున్నది . అందులో పాలు పంచుకున్నాము . అక్కడే స్వామీజీ కట్టించిన నారయణి అమ్మవారి ఆలయములో అమ్మవారిని దర్శించుకున్నాము . ఆశ్రమములో భోజన ప్రసాదము చేసాము . ఆశ్రమము చాలా ప్రశాంతము గా వున్నది . పూల చెట్లతో చక్కని కుటీరం లా ఎంత బాగుందో ! అక్కడ భక్తులు వుండేందుకు విశ్రాంతి గదులు కూడా వున్నయట .
మేము హైదరాబద్ చేరుకునేటప్పటికి సాయంకాలమైంది . మళ్ళీ ట్రాఫిక్ . . . . .
ఇంటికి చేరేటప్పటికి 8 గంటలైంది .
* * * * * * * * * * * * * * * * * * * * * * *
ఈ రోజు లక్ష్మి గారి జన్మదినము . అందుకే వారికి మా ఈ యాత్ర పోస్ట్ ను కానుకగా ఇస్తూ ,
లక్ష్మిగారు ,
మీరు ఇలాగే యాత్రలు చేస్తూ , మాతోనూ యాత్రలు చేయిస్తూ ,
ఆయు ఆరోగ్యాల తో సౌభాగ్యవతి గా వుండాలని కోరుకుంటూ ,
జన్మదిన శుభాకాంక్షలు .
Subscribe to:
Post Comments (Atom)
13 comments:
ముందుగా లక్ష్మి గారికి జన్మదిన శుభాకాంక్షలు.
తరువాత నా ఏడుపు...
తూచ్..ఇది తొండి. నేనొప్పుకోను. కార్తీకమాసం ఆఖరి రోజున మేమూ శ్రీశైలం, త్రిపురాంతకం వెళ్ళాము.నేను అన్ని ఫోటోలూ జాగర్త చేసి పెట్టుకున్నా. టపా రాద్దామని. పనుల్లొ బిజీ గా ఉండి రాయలేదు. ఇంతలోనే మీరు రాసేసారు..వా......
మాలా గారు, మీ లక్ష్మి గారికి జన్మ దిన శుభాకాంక్షలు తెలియచేయండీ...
సునీత గారూ , మీరు వ్రాసేయండి..ఎన్ని సార్లు చదివితే అంత పుణ్యమట..మాకు ఇంకొంచెం పుణ్యం ఇచ్చినట్టుంటుంది కదా మళ్ళీ!
ఇష్ట కామేశ్వరి దేవి గుడికి వెళ్ళచ్చండీ.కానీ చాలా రిస్కీ...రోడ్డు లేదు..కొద్దిమంది డ్రయివర్లకి తెలుసు దారి..చాలా రఫ్ గా ఉంటుంది ...మధ్యలో రెండు సార్లు బండి చేడిపోయింది..మేము కైలాసం దాకా వెళ్ళి...మళ్ళీ శ్రీశైలం వచ్చేసాం ఇష్ట కామేశ్వరీ దేవి దయ వల్ల!
లలితా సహస్రంలో అమ్మవారి రెండు నామాలు త్రిపురాంతకంలోవేనండి. యజ్ఞ కుండం నించి ఉద్భవించింది కాబట్టి చిదగ్ని కుండ సంభూత, కదంబ వృక్షాల మధ్య నివసించే తల్లి కాబట్టి కదంబ వనవాసిని. మేము సుమారు ఆరేళ్ళ క్రితం వెళ్ళాము. లలితామ్మవారి ఎదురుగా కూచుని కుంకుమ పూజ చేసుకున్నాను. అసలు ఎంత గొప్ప అనుభూతిని ఇచ్చిందో. అసలు చిన్న ఊళ్ళు అనుకుంటాం కానీ ఎన్ని గొప్ప గొప్ప విశేషాలున్నాయో, ఎన్ని పెద్ద పెద్ద దేవాలయాలున్నాయో మన భారతంలో ముఖ్యంగా మన రాష్ట్రంలో. నా అదృష్టం అటువంటి చాలా దేవాలయాలు దర్శించుకోవటం. మా అమ్మా, నాన్న ఎక్కడన్నా విన్నా, చదివినా ఆ వారాంతం ఆ దేవాలయ దర్శనం ప్లాన్ చేసేవారు. వారితో పాటు నేను. అలా ఎన్ని ఊళ్ళు చూపించారో. పుణ్యం అంతా మా అమ్మా,నాన్నదే. :)
లక్ష్మి గారికి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
ఎన్నెల గారు, అసలడగండి వీళ్ళని, ఎప్పుడూ నన్నొదిలేసి ఎందుకంత హాయిగా తిరిగొస్తారో:(
మాలా గారూ,
యీ పారి పోయేడిదుంటె గిన నన్ను,మన జోయ గారిని గుడ్త తోల్కబోన్రి ...బాంచన్ కాల్మొక్కుత
సునీత, ఎన్నెల, జయగార్లకు కృతజ్ఞతలు.
జయా, మీరొస్తానంటే...మేమొద్దన్నామా...తధికిటతధికిటతోం..
ఎన్నెలమ్మా..ఏడకన్నా పోవల్నంటే సోంచాయించకుండా బయలెల్లాల..మరి వురుకుండ్రి
మాలాగారూ, చాలా కష్టపడి చక్కని కార్డు తయారు చేశారు. కృతజ్ఞతలు.
psmlakshmi
Lakshmi garu thanks andee...meeku blog unnadani naaku telvad...iga danda yaatra modalu ....sonchayinchakunta urukutunnaa.....hahaha...
లక్ష్మి గారూ నేను తోల్కబొమ్మనని నారాజ్ అయిన్రు కావొచ్చు...మీ బ్లాగ్ బంద్ పెట్టుకున్రు..ఖుల్ల అయితల్లేదు..ఒక పారి చెక్ చేసి చెప్తరా..బాంచన్.
సునీత గారు ,
నాకు ఓపిక లేక అంత వివరము గా రాయలేదు . మీరు చక్కగా అన్ని వివరాలతో రాసేయండి . అంతేగాని ఏడవటమెందుకండి :)
& ఎన్నెలగారు ,
ఆ రిస్క్ తీసుకోదలుచుకోకనే మేము ఇష్టకామేశ్వరి ఆల్యానికి వెళ్ళ లేదండి .
మిమ్మలినీ మీ జొయగారినీ తప్పకుండా తీసుకెళ్తామండి , ఎందుకంటే మీలాంటి పిల్లలు మా చేతికింద ఇప్పుడు ఎంతైనా అవసరం . మరి ఎల్లుండి మహానంది వెళుదామనుకుంటున్నాము బేగొచ్చేయండి :)
ఇదిగోండి లక్ష్మి గారి బ్లాగ్ , అంతరంగ తరంగాలు కొంచం చిన్నగా వస్తాయి కాని యాత్ర మటుకు మహా ఫాస్ట్ గా వచ్చేస్తుందండొయ్ !
పద్మగారు ,
మీ వాఖ్యకు చాలా థాక్స్ అండి . మరి మీరు చూసిన దేవాలయాల విశేషాలు మాకూ చెప్పండి . వీలైతే వెళ్ళి వస్తాము .
& జయా ,
నువ్వస్తావా ? సరే రా . వస్తే మాకు చిన్న చిన్న పనులు చేసిపెట్టాలి . అంతే గాని ఎన్నల గారి తో కబుర్లు చెప్పుకుటూ కొండా కోనా తిరుగుతామంటే మటుకు తీసుకుపోము :)
థ్యాంక్స్ మాలా గారూ, జయ గారు నేను కబుర్లు చెప్పుకోవడం చెయ్యకపోతే అదో ప్రపంచ వింత అవ్వాలి..మీరేమీ భయపడకండీ...కబుర్లు చెప్పుకుంటుంటె ఇంకా ఫాస్ట్ గా చేస్తాంగా పనులు...ఆడుతు పాడుతు బ్యాచ్ అన్నమాట...మీకు కబుర్లకి, పనికీ కలిసి మంచి ప్యాకేజ్...ఆలసించిన ఆశాభంగం..ర్రండి బాబూ ర్రండి ..ఇండియాకి ఒక టికెట్ బుక్ చేసుకోండి..
అదీ ఎన్నెలమ్మా అట్లా చెప్పాలి. మనల్ని చాలా తక్కువ అంచనా వేసినట్లున్నారు. అరె...మాట్లాడొద్దు, పుట్టలెంబడి పోవద్దంటారెంటి. అహ...అసలట్లా ఎట్లా కుదురుద్దంటా!!!!!కొంచెం మా టైం ఎంబడి తీసుకెళ్ళాలి గాలి.
plz read for information on following blogs
gsystime.blogspot.com - telugu
galaxystime.blogspot.com - english
galaxystartime.blogspot.com - animation engines
Thanks
Post a Comment