ఈ తిరుమలగిరి కృష్ణా జిల్లా జగ్గయ్యపేట కు దగ్గరలో వుంది . ఇక్కడ వున్న వెంకటేశ్వరస్వామి మా ఇంటి ఇలవేలుపు.మా అత్తగారు వాళ్ళు హైదరాబాద్ కు రాక ముందు ,మా ఇంట్లో జరిగే శుభకార్యాలన్నీ ఇక్కడే జరుపుకునేవారట.చాలా సంవత్సరాల నుంచీ అనుకుంటూ వుంటే ఇప్పటి కి ఇక్కడకు రావటానికి వీలయ్యింది .
ఇక్కడ వెంకటేశ్వరస్వామి పుట్టలో నుంచి వచ్చినట్లుగా వుంటారు . విగ్రహం ఏదీ వుండదు. పుట్ట మాత్రమే వుంటుంది. పుట్ట మీద సహజసిద్దంగా ఏర్పడ్డ నామాలు 24 వుంటాయట. అందుకని ఈ స్వామివారిని 'నామాల వెంకటేశ్వరస్వామి"అంటారట.
ఈ దేవాలయము ఎన్ని ఏళ్ళక్రితం నిర్మించారో తెలీదుట. ఈ మధ్య దేవాదాయశాఖవారు దీనిని తిరిగి నిర్మించారట.ఉదయము 6 గంటల నుంచి సాయంకాలము 6 గంటల వరకు తెరిచి వుంటుంది. సాయంకాలము 6 గంటలకు మూసివేసిన తరువాత ఎట్టి పరిస్తితులలోనూ తిరిగి తెరువరు . ప్రతి రోజూ రాత్రి పూట దేవతలు ఇక్కడ స్వామివారిని పూజించుకుంటారట.అందుకు నిదర్షనం గా ఉదయము తలుపులు తీసాక పుట్ట చుట్టూ నీటి చుక్కలు కనిపిస్తాయట. చాలా మహిమగల స్వామి అని నమ్ముతారు .
జిలుగుమాడు
తిరుమలగిరి మా అత్తగారి మెట్టినింటివారి ఇలవేలుపైతే ,జిలుగుమాడు లోని శివయ్య ఆవిడ పుట్టినింటివారి ఇలవేలుపు .దాదాపు 150 సంవత్సరాల క్రితం మా అత్తగారింటి వారైన పెగళ్ళపాటి వీరభద్రయ్య గారికి పొలం లో భూమికింద శివలింగం వున్నట్లుగా కల వచ్చిందట. . అక్కడ తవ్విస్తే పానపట్టము తో సహా శివలింగం వుందట. దానిని వెలికి తీసి , అక్కడే చిన్న గుడి కట్టించి స్తాపించారట.గుడి కి వక అర ఎకరము పొలం ఇచ్చారట. అప్పటి నుంచి ఆ స్వామివారి ని ఇలవేలుపుగా కొలుస్తున్నారట.
దాదాపు 40 సంవత్సరాల క్ర్రితం అక్కడి పొలము ను ఎవరో ఆక్రమించుకున్నారు . గుడి ని మూత పెట్టారు . పూజా పున:స్కారాలు లేక జీర్ణించిపోయింది .రెండుమూడు సంవత్సరాల క్రితము ఆ ఇంటి ఆడపడుచు అన్నపూర్ణ( ఆవిడ అమ్మవారి భక్తురాలు. పూజలు చాలా చేస్తుంటారు)కు కలలో ఆ దేవాలయము కనిపించిందిట.వెంటనే ఆవిడ ఎన్నో వ్యయప్రయాసాలకు ఓర్చి ఆ దేవాలయాన్ని తిరిగి నిర్మించారు .నిత్య పూజలకై పూజారిని ఏర్పాటు చేసారు . ఆవిడ కూడా జిలుగుమాడు గ్రామం లో వక ఇల్లు అద్దెకు తీసుకొని ఎక్కువగా ఆ దేవాలయము లోనే గడుపుతూవుంటారు .
మధిర లో మావారి కజిన్ కుమార్తే వివాహమైతే వెళ్ళాము . అప్పుడు ఈ రెండు దేవాలయాలనూ దర్శించుకొని వచ్చాము .
2 comments:
maala garu, ikkade maa poorvikulu poojalu chesaaru anipinchinappudu..leda idi maa vallade anipinchinappudu..aa feeling chaala bavutundi... nice post
నరేష్ గారు ,
అవునండి . ముఖ్యంగా జిలుగుమాడు లోని గుడి ని చూసినప్పుడు మా పెద్దలు కట్టించినది కదా అని చాలా త్రిల్లింగ గా అనిపించింది .
మీ వాఖ్య కు థాంక్స్ అండి .
Post a Comment